ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వర్‌ డౌన్‌

ABN, First Publish Date - 2022-01-26T04:19:16+05:30

రెండు రోజులుగా సాంకేతిక లోపం

రిజిస్ర్టేషన్ల కోసం వేచి ఉన్న జనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సాంకేతిక లోపంతో నిలిచిన ధరణి రిజిస్ర్టేషన్లు
  • అవస్థల్లో రైతులు


కందుకూరు జనవరి25 : రెండు రోజులుగా సాంకేతిక లోపం (సర్వర్‌డౌన్‌) కారణంగా ధరణి రిజిస్ర్టేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రిజిస్ర్టేషన్ల కోసం కందుకూరు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఆయా గ్రామాల రైతులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు 50 మంది వరకు రిజిస్ర్టేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కాగా, సోమవారం 30మంది, మంగళవారం 30మంది రైతులు భూముల రిజిస్ర్టేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. కానీ కంప్యూటర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ రెండురోజుల నుంచి 60మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే రిజిస్ర్టేషన్లు అయ్యాయి. మిగిలినవారు రోజూ కార్యాలయానికి వచ్చి నిరాశగా వెనుదిరుగాల్సి వచ్చింది. ఇప్పటికైనా ధరణి వెబ్‌సైట్‌లో ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నాం

ధరణి వెబ్‌సైట్‌ సర్వర్‌డౌన్‌ అవుతుండటంతో ఇబ్బంది పడుతున్నాం. నగరానికి చెందిన మేము కందుకూరు రెవెన్యూ పరిధిలో భూమిని కొను గోలు చేశాం. రెండు రోజులుగా కార్యా లయం చుట్టూ తిరుగుతున్నా రిజిస్ర్టేషన్‌ కావడం లేదు. ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి.

- నన్నూరు సీతారాంరెడ్డి, రైతు


రెండు రోజులుగా సర్వర్‌డౌన్‌

ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి నిత్యం రిజిస్ర్టేషన్లు సాఫీగానే సాగుతు న్నాయి. రెండు రోజులుగా వెబ్‌సైట్‌ సర్వర్‌డౌన్‌ కావడంతో రిజిస్ర్టేషన్లు కావడం లేదు.

- ఎస్‌.జ్యోతి, తహసీల్దార్‌ 



Updated Date - 2022-01-26T04:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising