ప్రతిభను వెలికి తీసేందుకే సైన్స్‌ఫేర్
ABN, First Publish Date - 2022-12-07T22:40:56+05:30
గ్రామీణ ప్రాంత విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి సైన్స్‌ఫేర్‌లు ఎంతగానో దోహద పడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ జిల్లా స్థాయి సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనను ప్రారంభించారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్,డిసెంబరు 7 : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి సైన్స్‌ఫేర్‌లు ఎంతగానో దోహద పడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 50వ జిల్లా స్థాయి సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విద్యార్థిని వికారాబాద్ జిల్లా గోకపస్లాబాద్ కు చెందిన అశోక్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాక్షించారు. జిల్లాలో సైన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలుగా రాణించటానికి ప్రభుత్వం టీహబ్ ద్వారా కృషి చేస్తుందని ఇందులో విద్యార్థుల కోసం కొంత స్పెస్ కేటాయిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారని తెలిపారు. సొంత ఆలోచనలతో రండి.. పరిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ అభిమతమన్నారు. మంత్రి కేటీఆర్ ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో అనేక నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రొత్సహించాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులు విద్యతో పాటు ఆటల పోటీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఉన్న ఆసక్తిని పసిగట్టి వారిని ఆ రంగాలలో ప్రొత్సహించాలని కోరారు. ఈసారి పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో పాఠశాలల అభివృద్ధికి జడ్పీ నిధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ. మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీసేందుకు సైన్స్‌ఫెయిర్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ. విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తించే విధంగా తమ తెలివి తేటలను ప్రదర్శించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈవో రేణుకాదేవి, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
===============================================
Updated Date - 2022-12-07T22:40:57+05:30 IST