ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి

ABN, First Publish Date - 2022-12-13T23:50:30+05:30

ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఎమ్మార్పీఎస్‌ విశ్రమించకుండ పోరాడుతోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ కృష్ణ, నాయకుడు మల్లేశ్‌ అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు.

సుదర్శన్‌కు ఎన్నిక పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/షాద్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 13: ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంతో ఆవిర్భవించిన ఎమ్మార్పీఎస్‌ విశ్రమించకుండ పోరాడుతోందని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కో-కన్వీనర్‌ కృష్ణ, నాయకుడు మల్లేశ్‌ అన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఆమనగల్లులోని లక్ష్మీవెంకటనర్సింహ గార్డెన్‌లో మంగళవారం ఎమ్మార్పీఎస్‌ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వర్గీకరణ సాధనకు చేపట్టాల్సిన పోరాటాలు, నూతన కమిటీల ఏర్పాటు, ఉద్యమ బలోపేతం, స్థానిక సమస్యలపై చర్చించారు. వారు మాట్లాడుతూ వర్గీకరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలన్నారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రకిరణ్‌, సురేశ్‌, కిరణ్‌పూలే, రాజు, అమర్‌నాథ్‌, శ్రీకాంత్‌, నారాయణ, ఆనంద్‌, శివ, సురేశ్‌, మహేశ్‌, హజీ, ఆనంద్‌కుమార్‌, రాజరత్నం, రాజు, ఈశ్వరయ్య, యాదయ్య, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ నూతన కమిటీ ఏర్పాటు

ఆమనగల్లు మండల ఎమ్మార్పీఎస్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా కర్నె సుదర్శన్‌, కో-కన్వీనర్‌ గణేశ్‌, విజయ్‌చందర్‌, సలహాదారులు కృష్ణమాదిగ ఎన్నికయ్యారు. నూతన కమిటీకి నాయకులు ఎన్నికప్రతాన్ని అందజేసి సత్కరించి అభినందించారు.

ఢిల్లీ తరలిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిం చాలనే డిమాండ్‌తో టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో 14, 15తేదీల్లో జం తర్‌మంతర్‌ వద్ద చేపట్టే దీక్షకు షాద్‌నగర్‌ నుంచి ఎమ్మార్పీఎస్‌ నాయకులు తరలివెళ్లారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్‌ ఆధ్వర్యలో నాయకులు జంగయ్య, కృష్ణయ్య, శ్రీను, అశోక్‌, రాజు, వరప్రసాద్‌, శ్యాం తరలారు.

Updated Date - 2022-12-13T23:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising