ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ససేమిరా!

ABN, First Publish Date - 2022-12-11T00:08:55+05:30

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న చైర్‌పర్సన్‌ రాజీనామా చేయించే విషయమై చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఒప్పందం మేరకు చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలని కోరినా రాజీనామా చేయడం లేదని, ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు బల్దియా చైర్‌పర్సన్‌ స్వప్న రాజీనామాకు చివరి ప్రయత్నం విఫలం

సీఎం ఆదేశంతో మంత్రి తలసాని ఫోన్‌ చేసినా పట్టువీడని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి వద్ద చైర్‌పర్సన్‌ వాదన

తప్పు అని తేలితే సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం!

ఈనెలాఖరు కల్లా గుడ్‌న్యూస్‌ వస్తుందన్న మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వర్గం

తాండూరు, డిసెంబరు 10 : తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న చైర్‌పర్సన్‌ రాజీనామా చేయించే విషయమై చివరి ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. ఒప్పందం మేరకు చైర్‌పర్సన్‌ రాజీనామా చేయాలని కోరినా రాజీనామా చేయడం లేదని, ఈ విషయమై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మొన్నటి వరకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వరకే ఉన్న ఈ సమస్య సీఎం వరకు తీసుకెళ్లడంతో రాజీనామా చేయించే విషయం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో చర్చించే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ , ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి అప్పగించారు. ఇప్పటికే పలుమార్లు రంజిత్‌రెడ్డి మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ సారి మంత్రి తలసాని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. అయితే చైర్‌పర్సన్‌ రాజీనామాకు సిద్ధపడటం లేదని, ఈ విషయంలో మరోసారి ఫోన్‌ చేయొద్దని, ఇతర విషయాలు మాట్లాడాలని ఎమ్మెల్సీ మంత్రి తలసానికి తేల్చి చెప్పడంతో రాజీనామా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే ఇటీవల మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శి వద్ద చైర్‌పర్సన్‌ స్వప్న, ఇన్‌చార్జి కమిషనర్‌, ఆర్డీవో అశోక్‌కుమార్‌ మధ్య ఏర్పడిన విభేదాలు, సంతకం లేని ఎజెండా, బడ్జెట్‌ అంశం కోరం లేకుండా బడ్జెట్‌ ఆమోదించాలనే అంశం, వివాదాస్పదంగా మారిన సర్వేనెంబర్‌-52లోని నిర్మాణాల అంశాలపై చైర్‌పర్సన్‌ తరపు న్యాయవాది, ఇన్‌చార్జి కమిషనర్‌ అశోక్‌కుమార్‌ వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ వాదనలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌దే తప్పని తేలితే ఆమెను ఈసాకుగా చూపించి సస్పెండ్‌ వేటు వేయించి చైర్‌పర్సన్‌ పదవి నుంచి తప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అధికారిదే తప్పనితేలితే అధికారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. చైర్‌పర్సన్‌ రాజీనామా అంశాన్ని సీరియ్‌సగా తీసుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆయన వర్గం చైర్‌పర్సన్‌పై సస్పెన్షన్‌ వేటు వేసేందుకు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈనెలాఖరు నాటికి తమకు గుడ్‌న్యూస్‌ వస్తుందని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వర్గం ధీమాతో ఉంది.

Updated Date - 2022-12-11T00:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising