ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతోష్‌నగర్‌ నుంచి తలకొండపల్లికి ఆర్టీసీ బస్సు

ABN, First Publish Date - 2022-10-18T04:37:51+05:30

గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు,

ఆర్టీసీ బస్సును ప్రారంభిస్తున్న సర్పంచ్‌, ఎంపీటీసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తీరిన మక్తమాదారం విద్యార్థుల ఇబ్బంది 


కడ్తాల్‌ , అక్టోబరు 17: గ్రామీణ ప్రాంతాలకు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. కడ్తాల మండలం మక్తమాదారం గ్రామం నుంచి కడ్తాలకు నిత్యం కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా పాఠశాలలు విడిచిన సమయానికి బస్సులు లేకపోవడంతో రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులు పాఠశాలలోనే నిరీక్షిస్తున్నారని ఈనెల 16న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు హయత్‌ నగర్‌ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ కిరణ్‌, మహేశ్వరం డిపో మేనేజర్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. విద్యార్థులతోపాటు ప్రయాణికుల సౌకర్యార్థం సంతోష్‌నగర్‌ నుంచి తలకొండపల్లి వరకు రెండు ట్రిప్పులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు కు సోమవారం మక్తమాదారం గ్రామంలో సర్పంచ్‌ సులోచన సాయిలు, ఎంపీటీసీ మంజుల చంద్రమౌళి పూజలు చేసి ప్రారంభించారు. గ్రామస్తుల, విద్యార్థుల సౌకర్యార్థం మక్తమాదారంకు ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కల్పించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. 



Updated Date - 2022-10-18T04:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising