ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆర్‌ఎంపీలు ఏకతాటిపై పోరాడాలి’

ABN, First Publish Date - 2022-12-13T00:06:22+05:30

గ్రామాల్లో సేవా దృక్పథంతో ప్రజలకు వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఏకతాటిపై ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, డిసెంబరు 12: గ్రామాల్లో సేవా దృక్పథంతో ప్రజలకు వైద్యసేవలందిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఏకతాటిపై ఉంటూ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని రాష్ట్ర ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం అధ్యక్షుడు మల్లేశ్‌ పిలుపునిచ్చారు. సోమవారం అలియాబాద్‌ చౌరస్తా సమీపంలోని అన్య కన్వెన్షన్‌లో మల్లేశ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమాఖ్య రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆర్‌ఎంపీలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సమస్యలపై ప్రతీ ఆర్‌ఎంపీ స్పందించాలని వివరించారు. పోరాటం చేస్తేనే దశలవారీగా సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతామన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising