ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు నమోదు చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-18T04:26:47+05:30

ఓటు నమోదు చేసుకోవాలి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌,అక్టోబరు17 : ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 7 తేదీలోపు ఓటు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ నిఖిల తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికకు సంబంధించి ఓటు నమోదు ప్రక్రియపై  వివిధ రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ఫామ్‌ నెంబర్‌ 19 ద్వారా అర్హులైన ఉపాధ్యాయులు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.  ఏమైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 9 వరకు తెలియజేయాలన్నారు.  డిసెంబర్‌ 30వ జాబితాను వెలువరించడం జరుగుతుందన్నారు

  వరి ధాన్యం  సేకరణకు చర్యలు తీసుకోవాలి

వరి ధాన్యం సేకరణకు కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో 2 లక్షల 50వేల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని దానికి అనుగుణంగా అన్ని వసతులు సమకూర్చుకోవాలని తెలిపారు. 121  కేంద్రాల ద్వారా నవంబర్‌ 28 నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవా లన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి కాకుండా ప్రధాన రహదారులతో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో అశోక్‌ కుమార్‌, ఆర్డీవో విజయకుమారి,  డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఏవో గోపాల్‌, డీఎ్‌సవో రాజేశ్వర్‌, డీఎం విమల, యాదగిరి పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T04:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising