ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2022-12-15T23:52:23+05:30

ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌గూడ గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం గురువారం అధికారులు రైతులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు.

రైతులతో సమావేశమైన రెవెన్యూ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెర్లపటేల్‌గూడలో రికార్డుకు మించి పట్టాలున్నట్లు గుర్తింపు

ఎంజాయ్‌మెంట్‌ సర్వే తర్వాత మరోమారు సమావేశం

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 15: ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్‌గూడ గ్రామంలో ల్యాండ్‌ పూలింగ్‌ కోసం గురువారం అధికారులు రైతులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు. ఇక్కడ సర్వే నెం. 548లో 100 ఎకరాలపై 74మంది గతంలో లావణి పట్టాలు పొంది ఉన్నారు. ఈ భూముల్లో ప్రభుత్వ పాఠశాల, పల్లె ప్రకృతి వనం ఉన్నాయి. వీటికోసం 7 ఎకరాలు పోను 93 ఎకరాలను హెచ్‌ఎండీఏ ద్వారా అభివృద్ధి చేసి లే అవుట్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తహసీల్దారు రామ్మోహన్‌ రైతుల అభిప్రాయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం అభివృద్ధి చేసిన లే అవుట్‌లో పట్టాదారుకు 400 గజాల ప్లాటు ఇవ్ననున్నట్లు తహసీల్దారు చెప్పారు. కాగా ఎకరాకు రూ.60 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని పలువురు రైతులు డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం 74 మంది పట్టాలు ఇవ్వగా.. ఇక్కడ సుమారు 130 వరకు పట్టా సర్టిఫికెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే దీనినిబట్టి కొన్ని నకిలీ పట్టాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా ఎంజాయ్‌మెంట్‌ సర్వేచేసి మరోమారు రైతులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్ల్లు తహసీల్దారు రామ్మోహన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, చెర్లపటేల్‌గూడ, కర్నంగూడ సర్పంచులు కంభాలపల్లి గీతారాంరెడ్డి, వంగేటి కవితా తిరుమల్‌రెడ్డి, ఎంపీటీసీ అంకిల్ల ఆంజనేయులు ఉన్నారు.

Updated Date - 2022-12-15T23:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising