ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

ABN, First Publish Date - 2022-08-04T05:58:31+05:30

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీఎంఎస్‌ చెర్మన్‌

చేవెళ్ల, ఆగస్టు 3: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశాం అని జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మెన్‌ పి.కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్లలో డీసీసీబీ బ్రాంచ్‌లో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి రికార్డులో స్థాయిలో యాసంగి వడ్లు, శనిగలు కొందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 4లక్షల 86వేల 612క్వింటాళ్ల వడ్లు కొన్నామన్నారు. వాటికి గాను రైతులకు రూ.95.37కోట్లు చెల్లించామన్నారు. క్వింటాలుకు రూ.1,920 చొప్పున కొనుగోలు చేశామన్నారు. వడ్లతోపాటు శనిగలు క్వింటాలకు రూ.5,320కి తాండూర్‌, శంకర్‌పల్లి, పరిగి సెంటర్లల్లో 13,190 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. డీసీఎంఎస్‌ ప్రస్తుతం లాభాల్లో ఉందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మాధవ్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-04T05:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising