ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోష్‌కు తయార్‌!

ABN, First Publish Date - 2022-12-31T00:14:40+05:30

నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరానికి బైబై చెప్పి..

విద్యుద్దీపాల వెలుగులో నోవాటెల్‌ హోటల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూతన సంవత్సర వేడుకలకు ఉమ్మడి జిల్లా రెడీ

ఆకట్టుకునే ఈవెంట్లతో సిద్ధమవుతున్న రిసార్ట్స్‌, ఫాంహౌస్‌లు

రూ. లక్షల్లో ఎంట్రీ ఫీజులు

ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్‌ అయిన టికెట్లు

రెడీ అవుతున్న రకరకాల కేకులు

పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటున్న యువత

నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో పాత సంవత్సరానికి బైబై చెప్పి.. న్యూ ఇయర్‌లోకి ఫుల్‌ జోష్‌తో అడుగు పెట్టేందుకు యువత ప్లాన్‌ చేసుకుంటున్నారు. డిసెంబర్‌ 31 రాత్రి దావత్‌లు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కేకులు, బిర్యానీలు, మద్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వేడుకల కోసం వ్యవసాయ క్షేత్రాలు, ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు రెడీ అయ్యాయి.

వికారాబాద్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి/మేడ్చల్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ రంగారెడ్డి అర్బన్‌/ ఇబ్రహీంపట్నం/ శంషాబాద్‌రూరల్‌, డిసెంబరు 30 : న్యూఈయర్‌ వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని రిసార్ట్స్‌, హోటళ్లు ముస్తాబవుతున్నాయి. వీకెండ్‌ కావడంతో ఈ సారి న్యూఈయర్‌ వేడుకలు మరింత జోష్‌గా జరగనున్నాయి. . కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి యువత ఏర్పాట్లు చేసుకుంటుంది. కుటుంబాలు, స్నేహితులు, ఉద్యోగులు, కాలనీవాసులు బృందాలుగా ఏర్పడి న్యూ ఈయర్‌ వేడుకలను ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించేందుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో హోటళ్లు, రిస్టార్ట్స్‌, పబ్‌లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. నగర శివార్లలో జరుగుతున్న కొన్ని ఈవెంట్లకు రూ. లక్షలు వెచ్చించి జనం టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. డిసెంబర్‌ 31 రాత్రి వేడుకలకు రిసార్ట్స్‌, ఫాంహౌస్‌లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వేడుకలకు వచ్చే వారికి ఆహ్లాదం పంచేందుకు డీజేలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిసరాల్లో ఉన్న రిసార్ట్స్‌ల్లో తాత్కాలిక టెంట్లు వేసి సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. రిసార్ట్స్‌ల్లో ట్రెక్కింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌, అడ్వంచర్‌ గేమ్స్‌, లైవ్‌ సింగింగ్‌, డ్యాన్స్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ రిసార్ట్స్‌ల్లో ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి సింగర్స్‌, డ్యాన్సర్లను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని రిసార్ట్స్‌ల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌లు పూర్తయ్యాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రం పరిసరాల్లో 10 వరకు రిసార్ట్స్‌, 30 వరకు ఫాంహౌస్‌లు ఉన్నాయి. వీటిల్లో కూడా న్యూ ఈయర్‌ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.

రూ.లక్షల్లో ఎంట్రీ ఫీజు

రిసార్ట్స్‌, ఫాంహౌస్‌, హోటళ్లలో నిర్వహించే న్యూఇయర్‌ వేడుకలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో నిర్వాహకులు వీటిల్లో ఎంట్రీ ఫీజు పెంచేశారు. నగర శివార్లలో న్యూ ఈయర్‌ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ఈవెంట్లకు ఎగబడి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. నార్సింగ్‌లోని ఓమ్‌ కన్వెన్షన్‌లో శనివారం రాత్రి జరిగే ఈవెంటే ఖరీదైనదిగా చెబుతున్నారు. ప్రముఖ సింగర్‌ దర్శన్‌ రావల్‌తో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మూడు ప్యాకేజీల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఇక్కడ డైమండ్‌ ప్యాకేజీకి రూ. 2.50లక్షల టిక్కెట్‌ ధర ఉండగా.. ప్లాటినం ప్యాకేజీకి రూ. 1.25లక్షలు, గోల్డ్‌ ప్యాకేజీకి రూ. 75వేలు టిక్కెట్‌ ధరగా ఉంది. గచ్చిబౌలిలోని నోవటెల్‌లో రూ. 2,499 నుంచి రూ. 1,19,999 వరకు టిక్కెట్‌ ధరలు ఉన్నాయి. నగర శివార్లలోని వండర్‌లా అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో సన్‌బర్న్‌ రీలోడ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఉన్న రిసార్ట్స్‌లో సాధారణంగా వారాంతాల్లో ఒక్కొక్కరికీ రూ.1,800 నుంచి రూ.2 వేలు వసూలు చేయగా, ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచారు. టెంట్‌ కాటేజీకి రూ.2 వేల నుంచి రూ.3 వేలు, క్యాంపింగ్‌ కాటేజ్‌కు రూ.5 వేలు, ఉడెన్‌ కాటేజ్‌కు రూ.9వేల నుంచి రూ.10వేల వరకు చార్జి చేస్తున్నారు. వీటిల్లోకి ఇద్దరికి మాత్రమే అనుమతించనున్నారు. అదనంగా ఎవరైనా వస్తే ఒక్కొక్కరికీ రూ.1,500 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌ కూడా న్యూఈయర్‌ వేడుకలకు సిద్ధమైంది. మంచాల మండలం కాగజ్‌గట్‌ సిరి నేచర్‌ వ్యాలీలో వేడుకలకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ జంటకు రూ.12,000, సింగిల్‌ అయితే రూ.6,000 ఫీజు వసూలు చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో జంటకు రూ.8వేలుగా నిర్ణయించారు. శనివారం సాయంత్రం 7 నుంచి ఎంట్రీ ఉంటుంది. శామీర్‌పేట మండలంలోని సెలిబ్రిటీ రిసార్ట్స్‌ కూడా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. ఇక్కడ ప్రముఖ గాయకులు, సంగీత కళాకారులతో ఈవెంట్‌ను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిసార్ట్‌ ఎంట్రీ కోసం ఒక్కో టికెట్‌(జంట) ధర రూ. 12వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో డ్రింక్స్‌, స్నాక్స్‌ కూడా అందజేస్తారు. ఇప్పటికే టికెట్లన్నీ ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయి.

కేకులకు భలే గిరాకీ

నూతన సంవత్సరం సందర్భంగా బేకరీలు కేకుల తయారీలో బిజీబిజీగా ఉన్నాయి. అందమైన భారీ కేకులు తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. కొందరు దుకాణదారులు వివిధ రకాల కేకులను కొనుగోలు చేసేవారికి ఆఫర్లు ఇస్తున్నారు. కేకు కొన్నవారికి కూల్‌డ్రింక్‌ ఫ్రీ అంటూ ఆఫర్‌ చేస్తున్నారు. అదేవిధంగా కిలో కూల్‌ కేకు రూ.500 ఉంటే రూ.400కే విక్రయిస్తున్నారు. మరికొందరు నిర్వాహకులు కేకులను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. డిసెంబర్‌ 31వతేదీ పార్టీ చేసుకోవడానికి హోటళ్లు ధమ్‌కా బిర్యానీ సిద్ధం చేస్తున్నారు. ఆర్డర్లపై పార్సిళ్లను పంపిణీ చేస్తున్నారు. బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా ఉంటాయని కొందరు యువకులు డెలివరీల బైక్‌లు కూడా బుక్‌ చేసుకుంటున్నారు. ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దేందుకు రంగుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

వేడుకలకు ఎయిర్‌పోర్టు నోవాటెల్‌ హోటల్‌ సిద్ధం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్‌ లో న్యూ ఇయర్‌ వేడుకలకు సిద్ధమైంది. హోటల్‌ను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. హోటల్‌ బయట స్టేజీ ఏర్పాటు చేశారు. రుచికరమైన వంటకాలు, మద్యం వీటితోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. డిసెంబర్‌ 31వ తేదీన సాయంత్రం వేడుకలు ప్రారంభమై కొత్త ఏడాది 2023 వరకు సాగుతాయి.

జోరుగా కేకుల అమ్మకాలు

మామూలుగా అయితే రోజుకూ 30 నుంచి 35 కిలోల కేక్‌లు అమ్ముతుంటాం. కొత్త సంవత్సరం సందర్భంగా 300 నుంచి 400 కిలోల కేకులు అమ్ముడుపోయే అవకాశం ఉంది. కూల్‌ కేక్‌ సాధారణ రోజుల్లో కిలో రూ.500 అమ్ముతాం. కొత్త సంవత్సరం సందర్భంగా రూ.400కే ఇస్తున్నాం.

- సాయిరాం, శ్రీ లక్ష్మి స్వీట్స్‌ అండ్‌ బేకర్స్‌, ఇబ్రహీంపట్నం

న్యూఇయర్‌ ఆఫర్‌

న్యూ ఇయర్‌ ఆఫర్‌గా షైన్‌కు యాక్సెల్‌ ఫ్రీగా బిగించి ఇస్తాం, యాక్టివాకు యాక్సెల్స్‌కు రూ.4000 అవుతుంది. దీంట్లో 50 శాతం రాయితీ ఇస్తున్నాం. కొత్త సంవత్సరం సందర్భంగా రెండు షైన్‌, ఒక యాక్టివా వెహికిళ్లను బుక్‌ చేసుకున్నారు.

- సుధాకర్‌, మాక్సిమస్‌ హోండా షోరూం, ఇబ్రహీంపట్నం

కట్టుదిట్టమైన బందోబస్తు

న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. వేడుకలకు నిర్వహణకు అనుమతులు తప్పనిసరి. రిసార్ట్ప్‌, ఫాంహౌ్‌సలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. మద్యం తాగి వాహనాలు నడపొద్దు. డిసెంబరు 31 అర్ధరాత్రి సమయంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించవద్దు. ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో వాహన తనిఖీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తాం. ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే డయల్‌ 100కు కాల్‌ చేయాలి.

- కోటిరెడ్డి, ఎస్పీ, వికారాబాద్‌ జిల్లా

Updated Date - 2022-12-31T00:14:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising