ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-01-28T05:18:13+05:30

రేషన్‌ బియ్యం పట్టివేత

డీసీఎంలో పట్టుబడిన రేషన్‌ బియ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దందాను అరికట్టడంలో అధికారుల అలసత్వం?

పరిగి, జనవరి 27: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పరిగి పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. రూఫ్‌ఖాన్‌పేట్‌ శివారులో డీసీఎం(టీఎస్‌34 టి0005)లో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. డీసీఎంలోని 13క్వింటాళ్ల బియ్యంతోపాటు, వాహనాన్నీ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. దోమకు చెందిన డీసీఎం యజమాని వార్ల హరీ్‌షకుమార్‌ను విచారించగా.. బియ్యానికి సంబంఽధించి ఆధారాలు చూపలేదన్నారు. ఈ బియ్యంపై ఎన్ఫోర్స్‌మెంట్‌ డీటీ డి.పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హరీ్‌షకుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉంటే డీసీఎంలో బియ్యం భారీగానే ఉన్నా తక్కువ మొత్తం చూపించారన్న ఆరోపణలొస్తున్నాయి. పరిగిలో కొందరు ఏళ్లుగా రేషన్‌ బియ్యం దందా చేస్తున్నారు. ఈ దందాలో ఒక్కో వ్యక్తి ఎన్ని సార్లు దొరికినా చిన్న కేసులే పెట్టి వదిలేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే పీడీ కేసులు పెడతామని సీఎం కేసీఆర్‌ చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే రేషయ్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.

Updated Date - 2022-01-28T05:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising