ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరవేగంగా రాష్ట్ర అభివృద్ధి

ABN, First Publish Date - 2022-12-07T23:18:31+05:30

రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, విశ్వనగరం అభివృద్ధి ఫలితాలు రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా దక్కుతాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల / మొయినాబాద్‌, డిసెంబరు 7 : రాష్ట్రంతోపాటు హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, విశ్వనగరం అభివృద్ధి ఫలితాలు రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు కూడా దక్కుతాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు నిర్మించనున్న మెట్రోతో ఈ ప్రాంత ప్రజలకూ మేలు జరుగుతుందన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 9వ తేదీన పోలీస్‌ అకాడమీ వద్ద సీఎం కేసీఆర్‌ మెట్రో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అప్పా జంక్షన్‌ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. జీవో 111ను సైతం సీఎం కేసీఆర్‌ ఎత్తివేశారని గుర్తు చేశారు. రానున్న మూడేళ్లలో చేవెళ్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న రోజుల్లో చేవెళ్ల వరకు మెట్రో ట్రెయిన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సమావేశంలో ఎంపీపీ ఎం.విజయలక్ష్మి, వైఎస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణారెడ్డి, హన్మంత్‌రెడ్డి, నర్సింహులు, శివారెడ్డి, కృష్ణ, మహేశ్‌, సీహెచ్‌.వెంకటేశ్‌, నాగుల్‌రెడ్డి ఉన్నారు. రెండురోజుల క్రితం మృతిచెందిన మొయినాబాద్‌ మాజీ ఎంపీపీ కోట్ల రామకిృష్ణారెడ్డి కుటుంబసభ్యులను మంత్రి సబితారెడ్డి బుధవారం సాయంత్రం పరామర్శించారు.

Updated Date - 2022-12-07T23:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising