ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్కార్‌ బడుల్లో సమస్యల తాండవం

ABN, First Publish Date - 2022-04-11T04:45:31+05:30

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ..

బోయగూడ పాఠశాలకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చౌదరిగూడ మండలంలోని పాఠశాలలకు పక్కా భవనాలు కరువు
  • కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థలో భవనాలు
  • బోయగూడ పాఠశాల టీచర్‌ ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు పోతాడో తెలియదు
  • తండాలలో చదువులకు దూరమవుతున్న విద్యార్థులు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు


చౌదరిగూడ, ఏప్రిల్‌ 10: విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ.. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి అధ్వానంగా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పాఠశాలల్లో అసౌకర్యాల నడుమ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 

 చౌదరిగూడ మండలం ఎల్కగూడ, పద్మారం గ్రామపంచాయతీల పరిధిలోని బోయగూడ, రాంజాతాండ ప్రాథమిక పాఠశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బోయగూడ ప్రాథమిక పాఠశాలలో నలుగురే విద్యార్థులున్నారు. వారికి బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు వస్తాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా 15 రోజులకొకసారి మాత్రమే వస్తాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ పాఠశాలను సందర్శించగా.. ముగ్గురు విద్యార్థులు పాఠశాలకు వచ్చి కూర్చున్నారు. కానీ ఉపాధ్యాయుడు రాలేదు. ఇదే పాఠశాలలో పక్కా భవనం లేక అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుడు రానప్పుడు అంగన్‌వాడీ టీచర్‌ పిల్లలందరికీ పాఠాలు బోధిస్తుంటారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. 

అదేవిధంగా పద్మారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంజాతాండలోని ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేదు. ఎనిమిదేళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. పిల్లర్లకు వరకు పనులు చేసి నిలిపివేశారు. ఆ సమయంలో కేంద్రం నిధులతో నిర్మించిన స్మార్ట్‌ టాయిలెట్‌ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నిర్మాణ దశలో ఆగిపోయిన పాఠశాల భవనాన్ని గ్రామస్థుడు ఇటుకలతో గోడలు కట్టుకుని ప్రస్తుతం అందులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే రాంజాతండాలోని 22 మంది విద్యార్థులు తండాకు అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న వికారాబాద్‌ జిల్లా, పరిగి మండలం, వీరపూర్‌తాండలో నిరూపయోగంగా ఉన్న పాఠశాల భవనంలో చదువును కొనసాగిస్తున్నారు. వీరపూర్‌తాండలలోని 9 మంది విద్యార్థులు కూడా రాంజాతాండ పాఠశాలలో పేరు నమోదు చేసుకుని చదువుకుంటున్నారు. వీరందరికీ కలిపి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తుంటాడు. ఆ ఉపాధ్యాయుడు కూడా రాంజాతాండ పాఠశాలకు చెందినవారు. వీరపూర్‌ తండా పాఠశాలకు ఉపాధ్యాయుడే లేడు.


వృథాగా పాఠశాలల భవనాలు

చౌదరిగూడ మండలంలోని గోవులబండతాండ, వేపకుచ్చతాండ, చలివేంద్రంపల్లి, రాంజాతాండ, దామరగిద్దతండాల్లోని పాఠశాల భవనాలు వృథాగా ఉన్నాయి. నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయి శిథాలవస్థకు చేరుకున్నాయి. విద్యార్థులున్న చోట భవనాలు లేవు.. విద్యార్థులు లేనిచోట పాఠశాలల భవనాలకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేశారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆయా గ్రామల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామల ప్రజలు, మారుమూల తాండవాసులు కోరుతున్నారు.


సార్‌ బడికి సరిగ్గా రాడు

 మాకు చదువు రాదు. మా పిల్లల్ని మంచిగా చదివించాలని ఉంది. పాఠశాలకు పంపిస్తే సార్‌ ఎప్పుడు వస్తాడో.. ఎప్పుడు రాడో తెలవట్లేదు. గతంలో ఉన్న టీచర్‌ రోజూ వచ్చేది. ఇప్పుడు అంగన్‌వాడీ టీచరే పిల్లలకు చదువు చెప్తుంది. మాది చిన్నపల్లే అని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ స్కూల్‌కు పంపేందుకు డబ్బులు లేవు. అధికారులు పట్టించుకుని మా పిల్లలకు న్యాయం చేయాలి.

బోయ భారతమ్మ, విద్యార్థిని తల్లి, బోయగూడ



Updated Date - 2022-04-11T04:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising