ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గిరిజన రైతుల సమస్య తీర్చాలి’

ABN, First Publish Date - 2022-05-24T05:36:02+05:30

‘గిరిజన రైతుల సమస్య తీర్చాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, మే 23: ఎన్నెపల్లి రెవెన్యూ పరిధిలోని ఆరు సర్వే నెంబర్లలో భూములున్న గిరిజన రైతుల భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కిషన్‌నాయక్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి అ టవీ శాఖది అంటూ రైతులను ఫారెస్ట్‌ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. వెంటనే ఆ భూములకు జాయింట్‌ సర్వే చేసి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదును కలెక్టర్‌కు అందజేశారు. సర్వే నెంబర్‌ 163, 164, 178, 179, 180, 181లలో భూమి దామగుండం అటవీ ప్రాంతానికి అనుకొని ఉందని, ఈ భూమిని మండల సర్వేయర్‌ ఇప్పటికే సర్వే చేశారన్నారు. రై తులకు చూపిన భూముల్లోనే వారు సాగు చేసుకుంటున్నార ని తెలిపారు. ఇప్పటికైనా జాయింట్‌ సర్వే నిర్వహించి రైతులకు భూమి చూపాలని కోరారు. లేకుంటే రెండుమూడు రోజుల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు సోనీబాయి, రాములు, రమణిబాయి,గోపాల్‌, సురేష్‌, ప్రకాశ్‌, లక్ష్మీబాయి, రత్నీబాయి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:36:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising