ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి

ABN, First Publish Date - 2022-04-25T05:20:45+05:30

ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి

బొడ్రాయి వద్ద పూజలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందుర్గు, ఏప్రిల్‌, 24: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డి అన్నారు.  మండలంలోని లాలాపేట్‌లో ఆదివారం బొడ్రాయి ప్రతిష్టాపన చేశారు. అదేవిధంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి, కాశీ విశ్వనాథస్వామి, శ్రీసీతారామాంజనేయ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ యువ నేత వై మురళీయాదవ్‌, రాజేష్‌ పటేల్‌, రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, అంబాదాస్‌ పూజల్లో పాల్గొన్నారు. 

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలి 

 భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిఒక్కరూ పరిరక్షించాలని పుష్పగిరి పిఠాధిపతి నృసింహాభారతి అన్నారు. మండలంలోని లాలాపేట్‌లో బొడ్రాయి, గణపతి, కాశీ విశ్వనాథస్వామి, శ్రీసీతారామాంజేయ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన  కార్యక్రమాలను నిర్వహించారు. ఈసందర్భంగా నృసింహాభారతి మాట్లాడుతూ సమాజానికి కావలసిన అన్ని వనరులను ప్రకృతి అందిస్తుందని, పంచభూతాలు సహకరిస్తున్నాయని వివరించారు. భారతదేశంలో జన్మించిన వారందరూ హిందువులేనని, అనంతరం మతమార్పిడిలు జరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలకు వెళ్లడం, గ్రామదేవతలను పూజించడం అనేది శాస్ర్తాల్లోనూ ఉందని, అందువల్లే ఆయాదేవతలకు పూజలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల సమాజంలో  ధర్మం, న్యాయం, శాంతి నెలకొంటుందని ఆయన ఉద్బోధించారు. తల్లిదండ్రులు కూడా మతం, ధర్మం, న్యాయం గురించి తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాంరెడ్డి, శ్రీనివా్‌సరావు, నర్సింహాచార్యులు, మల్లేష్‌, లక్ష్మారెడ్డి, కృష్ణారెడ్డి, అంబాదాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

వైభవంగా బీరప్ప స్వామి బోనాలు

కొందుర్గు మండల కేంద్రంలో ఆదివారం బీరప్పలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో గ్రామం నుంచి ఊరికి వెలుపల ఉన్న బీరప్ప స్వామి దేవాలయం వరకు ఉరేగింపుగా వెళ్లారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్లాక, స్వామి వారికి ప్రదక్షిణలు చేసి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-04-25T05:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising