ఘనంగా పోచమ్మ బోనాలు
ABN, First Publish Date - 2022-07-19T05:19:10+05:30
ఘనంగా పోచమ్మ బోనాలు
చందన్‌వెళ్లిలో బోనాలతో ఆలయానికి బయల్దేరిన మహిళలు, గ్రామస్తులు
షాబాద్/మేడ్చల్, జూలై 18(ఆంధ్రజ్యోతి): షాబాద్ మండలంలోని రుద్రారం, చందన్‌వెళ్లి గ్రామాల్లో గ్రామ దేవత పోచమ్మకు బోనాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం గ్రామాల్లో ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయల్దేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ వెంకట్, స్వామి, కృష్ణ, వెంకటేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-19T05:19:10+05:30 IST