ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ సాయం

ABN, First Publish Date - 2022-10-18T04:29:06+05:30

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ సాయం

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ సాయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెట్టుబడి రూపంలో రూ.28.43 కోట్లు
  • జిల్లాలో 142169 రైతు కుటుంబాలకు లబ్ది
  • సోమవారం ప్రారంభమైన నగదు బదిలీ ప్రక్రియ
  • వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ చేయనున్న అధికారులు

వికారాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  రెండు హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన (పీఎం - కిసాన్‌) 12వ విడత పెట్టుబడి సహాయం సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 270232 మంది రైతు కుటుంబాలు ఉండగా, వాటిలో 142169 మంది రైతు కుటుంబాలు పీఎం కిసాన్‌ పథకం సహాయం పొందడానికి అర్హత ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం నుంచి 12వ విడత పెట్టుబడి సాయం ఈ రైతుల ఖాతాల్లోకి బదిలీ ప్రారంభమైంది. ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 వేల వంతున జిల్లాలో మొత్తం 142169 కుటుంబాలకు రూ.28,43,38,000 అందజేయనున్నారు. రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల పెట్టుబడి సహాయాన్ని మూడు విడతల్లో అందజేస్తున్న విషయం తెలిసిందే. గత ఫిబ్రవరి నెలలో మొదటి విడత సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసిన అధికారులు రెండవ విడత సహాయాన్ని మంగళవారం నుంచి జమ చేయనున్నారు. రోజుకు కొంత మంది రైతుల వంతున వారం రోజుల్లో ఎంపిక చేసిన రైతులందరి ఖాతాల్లో పీఎం - కిసాన్‌సహాయం జమకానుంది. కాగా, పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించిన 2019, ఫిబ్రవరి నెలలో మొదటి విడతలో జిల్లాలో 102127 రైతు కుటుంబాలకు రూ.20.42 కోట్ల సాయం అందగా, ఈసారి 142169 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.28,43 కోట్లు జమకానున్నాయి. పీఎం కిసాన్‌ సహాయం జమ కాగానే సంబంధిత రైతులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం వచ్చింది.

Updated Date - 2022-10-18T04:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising