చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-09-21T06:16:15+05:30
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
- సరిగా వైద్యం చేయలేదని ఆస్పత్రిపై బంధువుల దాడి
శంషాబాద్, సెప్టెంబరు 20: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందాడని అతడి బం ధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం శం షాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. ఽఫరూక్‌నగర్ మండలం ఏనుగుల మడుగుతండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్(43) ఆటో డ్రైవర్. గత నెల 26న సాతంరాయి వద్ద ఆటో బోల్తాపడి అతడికి తీవ్రగాయలయ్యాయి. కుటుంబ సభ్యులు అతడి ని మొదట లిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం సరిగా చే యడం లేదని పక్కనున్న ఆర్కాన్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు అతడికి కాలేయ సంబంధ ఆపరేషన్ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద అందోళన, దాడి చేశారు. పోలీసులు చేరుకొని వారికి నచ్చజెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-09-21T06:16:15+05:30 IST