ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ పనులను పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2022-01-20T03:58:20+05:30

పెండింగ్‌ పనులను పూర్తిచేయాలి

సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులతో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌/మోమిన్‌పేట : పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో రివ్వ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా మంజూరు కావాల్సిన రోడ్డు త్వరగా మంజూరు చేయడానికి కృషి చేయాలన్నారు. పనులు జరిగిన వెంటనే ఎంబీ రికార్డు చేయడంలో అలసత్వం వహించరాదన్నారు. నూతనంగా మంజూరైన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు వెంటనే ప్రారంభించాలని సర్పంచులను, సంబంధిత అధికారులను ప్రొత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఈ జితేందర్‌, ఏఈలు ప్రణీత్‌, లక్ష్మయ్య, మధు, శ్రవణ్‌లు పాల్గొన్నారు.

  • కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్పల్లి, మోమిన్‌పేట మండలాలకు చెందిన 21 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ మోమిన్‌పేట మండలాధ్యక్షుడు వెంకట్‌, ఎంపీటీసీ కుశల్‌ కుమార్‌, సర్పంచులు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • సీఎంఆర్‌ఎఫ్‌.. ప్రజారోగ్యానికి అభయం 

ప్రజల ఆరోగ్యానికి అభయంగా సీఎం సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్‌ నియోజకవర్గంలోని 23 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రగతి సాధించాలి

బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. బుధవారం స్థానిక రవీంద్ర మండపంలో వికారాబాద్‌ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అసంపూర్తిగా ఉన్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. మండలంలో అసంపూర్తి దశలో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించేలా అవగాహన కల్పిస్తూ పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరిగేలా ప్రొత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదినీరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య తదితరులున్నారు.

Updated Date - 2022-01-20T03:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising