ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-12-07T22:45:24+05:30

పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు.

పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి

కొడంగల్‌, డిసెంబరు 7: పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రతీ కేసును సమగ్ర దర్యాప్తు చేసి నేరస్థులకు శిక్ష పడే విధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం కలిగించాలన్నారు. పోలీసు శాఖలో అమలు చేస్తున్న వర్టికల్స్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పోలీసు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీ చేపట్టాలని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను నిఘా ఉంచాలన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవే రోడ్డు కావడంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసు సిబ్బంది మొక్కలు పెంచి జిల్లాకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అన్నీ పోలీస్‌స్టేషన్‌లలో మొక్కలు పెంచి పచ్చని ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి, కొడంగల్‌ సీఐ బి.శంకర్‌, ఎస్సై ఏ.రవిగౌడ్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌ ఎస్సైలు రమేశ్‌కుమార్‌, నయీముద్దీన్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-07T22:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising