ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక చింతనతో శాంతిసౌభాగ్యాలు

ABN, First Publish Date - 2022-08-20T05:03:42+05:30

ఆధ్యాత్మిక చింతనతో శాంతి సౌభాగ్యాలు, సకల సంపదలు

యాగ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిభట్ల, ఆగస్టు 19 : ఆధ్యాత్మిక చింతనతో శాంతి సౌభాగ్యాలు, సకల సంపదలు సమకూరుతాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగం రెండోరోజు శుక్రవారం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ తెలంగాణలో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తుందని, ఇది శుభ పరిణామమని అన్నారు. యజ్ఞ యాగాదుల నిర్వహణ వల్ల ప్రకృతిలో సానుకూల మార్పులు ఏర్పడి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రాష్ట్రం సుబిక్షం అవుతుందని తెలిపారు. కంచి పీఠం ఉభయ వేదాంత ప్రవక్త దమారి మురళీధరాచార్యులు కృష్ణావతార వైభవంపై అనుగ్రహ భాషణం చేశారు. హోమ నిర్వహణ అనంతరం లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కనులపండుగగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి పెద్దసంఖ్యలో వచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు  వెంకట రమణారెడ్డి, ఎంపీపీ కృపేష్‌, వైస్‌ ఎంపీపీ ప్రతా్‌పరెడ్డి, సర్పంచ్‌ అశోక్‌వర్ధన్‌రెడ్డి, పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, మంచాల ఎంపీపీ నర్మద, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, మాజీ జడ్పీటీసీ రమేష్‌ గౌడ్‌, చీరాల రమేష్‌, బుగ్గ రాములు, భరత్‌రెడ్డి, మంద సురేష్‌, రాజేందర్‌రెడ్డి. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు, సీఐ సైదులు, తహసీల్దార్లు సుచరిత, అనిత, రామ్మోహన్‌, ఎంపీడీఓలు శ్రీనివాస్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.



Updated Date - 2022-08-20T05:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising