ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2022-05-24T05:17:58+05:30

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

తాండూరులో మాట్లాడుతున్న బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తాండూరు, మే23: రెడ్లతోనే పార్టీల మనుగడ సాధ్యం అని మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణచెప్పాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం తాండూరులో నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ రాజ్‌కుమార్‌, సీఐటీయూ, కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్‌, ఉప్పలి మల్కయ్య, బుగ్గప్ప, షుకూర్‌, అబ్బని బసయ్య మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అరాచకాలను అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలతోనే మనుగడ సాగుతోందన్నారు. మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌, తాండూరులో మహరాజ్‌ కుటుంబాలు లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఏమయ్యేదని వారన్నారు. బహుజనులకు రేవంత్‌రెడ్డి వెంటనే క్షపమాణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాయకులు జ్యోతి, లక్ష్మణ్‌చారి, రాధాకృష్ణ, బసు, రమేష్‌, రాము, వెంకట్‌, నరేష్‌, మహదేవ్‌, అశోక్‌, మతిన్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising