ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించండి

ABN, First Publish Date - 2022-07-05T05:29:27+05:30

మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించండి

యాచారం: వినతిపత్రం అందజేస్తున్న మధ్యాహ్నభోజన కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం/యాచారం/మొయినాబాద్‌, జూలై 4: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.జగదీష్‌, మధ్యాహ్న భోజనం యూనియన్‌ జిల్లా అద్యక్షురాలు స్వప్నలు డిమాండ్‌ చేశారు. సోమవారం సీఐటీయూ ఆద్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రెండేళ్లుగా గుడ్ల బిల్లులు, ఆరు నెలలుగా నిర్వహణ బిల్లులు రావడం లేదని ఆరోపించారు. కార్మికులు అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారనిగుర్తు చేశారు. ప్రతినెలా బిల్లులు చెల్లిస్తూ కార్మికులకు నెలకు రూ.2వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎల్లేష్‌, గిరి, కళమ్మ, శిరీష, మైసమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండల మధ్యాహ్న భోజన కార్మికులు మండల ఎమ్మార్సీ భవన్‌లో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల సిఐ టియు నాయకులు పి.బ్రహ్మయ్య, కార్మికులు పార్వతమ్మ, సుజాత పాల్గొన్నారు. అదేవిధంగా మొయినాబాద్‌ ఎంఈవో కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ ప్రవీణ్‌ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జీఐటీయూ జిల్లా కార్మదర్శి చంద్రమోహన్‌, విజయలక్ష్మి, ఇందిర, యాదమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising