ప్రజాసేవ కోసం పార్టీ స్థాపించా : సదానందరెడ్డి
ABN, First Publish Date - 2022-08-04T05:58:26+05:30
ప్రజాసేవ కోసం పార్టీ స్థాపించా : సదానందరెడ్డి
తాండూరు రూరల్, ఆగస్టు 3 : తెలంగాణ రాష్ట్రంలో ప్రజాసేవ కోసమే పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీని ఏర్పాటుచేశానని, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపకుడు వి.సదానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్ రేణుకాఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటుచేసి, ప్రజాసంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. తాను అడిషనల్ ఎస్పీగా ఆరేళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ వీఆర్‌ఎస్ తీసుకుని ప్రజాసేవ కోసం పార్టీని స్థాపించానన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ప్రజలకు మేలు చేయడం లేదని, తన జీవితం ప్రజల కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. తాండూరు ప్రాంతంలో విలువైన ఖనిజ సంపద ఉందని, దానిని రాజకీయ నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం ఆటో ర్యాలీ నిర్వహించారు.
Updated Date - 2022-08-04T05:58:26+05:30 IST