ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనులపండువగా భద్రే శ్వరుడి పల్లకీసేవ

ABN, First Publish Date - 2022-04-22T05:26:28+05:30

కనులపండువగా భద్రే శ్వరుడి పల్లకీసేవ

తాండూరు : భద్రేశ్వరుడి పల్లకీసేవ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు/బొంరాస్‌పేట్‌/పరిగి, ఏప్రిల్‌ 21 : తాండూరు పట్టణంలో శ్రీభావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి పల్లకీసేవ కనులపండువగా కొనసాగింది. భద్రేశ్వర చౌక్‌ నుంచి గాంధీచౌక్‌, మఠం గల్లీ తదితర వార్డులమీదుగా పల్లకీని ఊరేగింపుగా తీసుకెళ్లారు. పట్టణవాసులు స్వామివారికి హారతిచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. 

  • ఘనంగా హనుమాన్‌ విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

బొంరాస్‌పేట్‌ మండలంలోని బొట్లవనితండా పరిధిలోని పూర్యనాయక్‌ తండాలో ఆంజనేయస్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తండావాసులు రవినాయక్‌, చందర్‌నాయక్‌, లాలునాయక్‌, రాంసింగ్‌, నార్యనాయక్‌, బంద్యనాయక్‌, నర్సింగ్‌, విఠల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నెహ్రూనాయక్‌, బాలునాయక్‌, బాబ్యనాయక్‌, అనిల్‌, శ్రీను, దేవేందర్‌ తదితరులున్నారు. 

  • మల్లెమోని గూడలో బొడ్రాయి ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు 

పరిగి మునిసిపల్‌ పరిధిలోని మల్లెమోని గూడలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌ తెలిపారు. గురువారం మునిసిపల్‌ పరిధిలోని మల్లెమోనిగూడలో బొడ్రాయి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామస్తులు సూర్యనారాయణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-22T05:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising