ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగి పొర్లుతున్న చెరువులు

ABN, First Publish Date - 2022-10-08T05:00:03+05:30

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆమనగల్లులోని

ఉధృతంగా పారుతున్న సురసముద్రం అలుగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, అక్టోబరు 7: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆమనగల్లులోని సురసముద్రం చెరువులోకి పెద్దఎత్తున వరద నీరు చేరుతుంది. ఇప్పటికే నిండిన చెరువు అలుగుబారుతోంది. అలుగు వద్ద గతంలో నీరు వృథాగా పోకుండ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టికట్ట కొట్టుకుపోయింది. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌, సీఐ ఉపేందర్‌, ఎస్‌ఐ సుందరయ్య అప్రమత్తమై అలుగు వద్ద ప్రమాదాలకు చోటుచేసు కోకుండా చర్యలు చేపట్టారు. సురసముద్రం చెరువు నుంచి దిగువన ఉన్న మేడిగడ్డ కత్వ వాగులోకి భారీగా నీరు చేరడంతో పొంగిపొర్లుతుంది. శంకర్‌కొండ- మేడిగడ్డ తండాల మధ్య వాగు సాగి రాకపోకలు నిలిచిపోయాయి. 


అలుగుపారుతున్న పట్నం పెద్దచెరువు

ఇబ్రహీంపట్నం: సుదీర్ఘకాలం తర్వాత ఇబ్రహీంపట్నం పెద్దచెరువు అలుగుపారుతోంది. 1975లో అలుగుపారిన చెరువు తాజాగా పూర్తిస్థాయిలో నిండి గంగమ్మ గట్టుదాటడంతో స్థానికుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. చెరువు నీటి నిల్వ శుక్రవారం రాత్రి 39ఫీట్లు ఎత్తు దాటింది. ఫలితంగా ఉప్పరిగూడ క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డుపై అలుగు పారుతోంది. దీంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు జనం పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో చెరువు కట్టపై ట్రాఫిక్‌ ఇబ్బందికరంగా మారింది. 


చిన్న చెరువుకు తూము తీయొద్దని డిమాండ్‌

ఇబ్రహీంపట్నం చిన్న చెరువు వద్ద తూము తీసి నీరు విడుదల చేయొద్దని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. కాగా, చిన్న చెరువు తూమునుంచి లీకవుతున్న నీరు చెరువు కింద ఉన్న అయ్యప్ప ఆలయంలోకి పోతున్నాయని భక్తులు మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శుక్రవారం జేసీబీ సహాయంతో నీటిని మళ్లించేందుకు ప్రయత్నించగా.. మత్స్యకారులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో ఆ సంఘం నాయకులను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయమై కమిషనర్‌ యూసుఫ్‌ మాట్లాడుతూ.. అయ్యప్ప దేవాలయంలోకి నీరు రాకుండా నీటిని మళ్లించేందుకు మాత్రమే ప్రయత్నం చేశామని.. దీనిని మత్య్సకారులు తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పారు. తూములు తీయడం తన పరిధిలోకి రాదనే విషయం గుర్తించాలన్నారు. కాగా బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ చెరువులో నీరు నిల్వ ఉండాల్సిందేనని, తూములను తొలగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.



Updated Date - 2022-10-08T05:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising