ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి

ABN, First Publish Date - 2022-01-29T05:29:11+05:30

కొనసాగుతున్న కొవిడ్‌ ఉధృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లాలో కొవిడ్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రోజులుగా నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నా కొవిడ్‌ ఉధృతి మాత్రం తగ్గుముఖం పట్టలేదు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 1419 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 155 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాండూరు నియోజకవర్గం పరిధిలో 516 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 63 మందికి పాజిటివ్‌ వచ్చింది. తాండూరులో 270 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 51 మందికి పాజిటివ్‌ సోకినట్లు నిర్ధారించారు. పెద్దేముల్‌లో 4, జిన్‌గుర్తిలో 3, నవాల్గలో 3, యాలాల్‌లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలో 440 మందికి పరీక్షలు జరపగా, వారిలో 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌ పరిధిలో రామయ్యగూడ, సిద్దులూరు, ఏరియా ఆసుపత్రిలో 211 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 24 మందికి పాజిటివ్‌ సోకినట్లు గుర్తించారు. ధారూరులో 5, కోట్‌పల్లిలో 2, నాగసమందర్‌, నవాబుపేట్‌ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది. పరిగి నియోజకవర్గం పరిధిలో 258 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 39 మందికి పాజిటివ్‌ సోకింది. పరిగిలో 19, కులకచర్లలో 15, దోమలో 3, పూడూరులో 2 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కొడంగల్‌ నియోజకవర్గం పరిధిలో 205 మందికి పరీక్షలు చేయగా, వారిలో 20 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. కొడంగల్‌లో 8, అంగడి రాయిచూర్‌లో 6, బొంరాస్‌పేట్‌లో 4, దౌల్తాబాద్‌లో 2 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 

Updated Date - 2022-01-29T05:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising