ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త రిక్షాలు మూలకు

ABN, First Publish Date - 2022-05-18T03:48:23+05:30

చెత్త రిక్షాలు మూలకు

కాశీంపూర్‌లో రోడ్డు పక్కన పడేసిన చెత్త రిక్షా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చిన్నపాటి మరమ్మతులతో వినియోగించుకునే అవకాశం

బషీరాబాద్‌, మే 17: స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో భాగంగా చెత్త ఎత్తివేతకు ప్రతీ పంచాయతీకి మూడు చక్రాల చెత్త రిక్షాలను ఇచ్చారు. చెత్తను డస్ట్‌బిన్ల వరకు తరలించేందుకు వీటిని వినియోగిస్తారు. ఇది బాగానే ఉన్నా.. రిక్షాలు నాణ్యత లేక పాడయ్యాయి. క్వాలిటీ మెటీరియల్‌ వాడకపోవడంతో చిలుమెక్కి ఎక్కడికక్కడ విరిగిపోయాయి. చక్రాల టైర్లు సైతం ఖరాబయ్యాయి. దీంతో పారిశుధ్య సిబ్బంది వాటిని వాడలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ప్రతీ పంచాయతీకి ఒక్కో ట్రాక్టర్‌, ట్రాలీ మంజూరు చేసిన నేపథ్యంలో వాటి అవసరమే లేకుండా పోయింది. కాశీంపూర్‌, బషీరాబాద్‌, నవాల్గ, పర్వత్‌పల్లి, మైల్వార్‌ తదితర గ్రామాల్లో చెత్త సేకరణ రిక్షాలు పంచాయతీ కార్యాలయాల్లో మూలన పడేశారు. అవి పూర్తిగా తప్పు పడుతూ రూపాన్ని కోల్పోతున్నాయి. వాటికి చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే చెత్త ఎత్తివేత, ఇతర పనులకు వాడుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2022-05-18T03:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising