ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణేశ్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

ABN, First Publish Date - 2022-09-08T05:41:32+05:30

గణేశ్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోమిన్‌పేట్‌, సెప్టెంబరు, 7: వినాయక నిమజ్ఞనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని మోమిన్‌పేట్‌ సీఐ యం.వెంకటేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వినాయక ఉత్సవ కమిటీల నిర్వాహకులు, అధికారులు, మండల ప్రజలతో సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా శోభాయాత్రలో పాల్గొనేందుకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దన్నారు. శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటుందని, ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడపవద్దని, డీజేలకు అనుమతి లేదని, టపాసులు కాల్చరాదని అన్నారు. నిమజ్ఞన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామని, నిమజ్ఞనం సందర్భంగా వైన్‌షాపులు మూసివేయించడం జరుగుతుందని, నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రార్థన స్థలాల వద్ద వాహనాలను ఆపకూడదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయవద్దని, బ్యానర్లను ప్రదర్శించవద్దని సూచించారు. ఎంపీడీవో శైలజారెడ్డి, ఎస్సై విజయప్రకాశ్‌, ఆర్‌ఐ మోహన్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-08T05:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising