ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ నుంచి స్వదేశానికి..

ABN, First Publish Date - 2022-03-04T05:55:52+05:30

Home from Ukraine ..

హైదరాబాద్‌కు చేరిన మదీహ ఆసమ్‌కు స్వాగతం పలుకుతున్న కుటుంబీకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు, మార్చి 3: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ పలువురు విద్యార్థులు స్వదేశం వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తాండూరుకు చెందిన విద్యార్థిని, మరి కొందరు గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. తాండూరు అస్కరిభాగ్‌కు చెందిన మదీహ ఆసమ్‌(23) అనే విద్యార్థిని మెడిసిన్‌ కోసం 2019లో ఉక్రెయిన్‌ వెళ్లింది. అక్కడి ఇవావో ఫ్రాన్స్‌క్లీ యూనివర్సిటీలో మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో మదీహ ఆసమ్‌తోపాటు మరి కొంతమంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని ఇస్రా నుంచి గురువారం మధ్యాహ్నం 12.30గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి స్పైస్‌జెట్‌ విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వారికి శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద బంధువులు, తాండూరు టీఆర్‌ఎస్‌ నాయకుడు మసూద్‌ ఘనస్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ నుంచి వారిని రప్పించేందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సహకరించారు. ఈ సందర్భంగా వారికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 

  • థ్యాంక్స్‌ టు ‘ఆపరేషన్‌ గంగ’ ఫ్లెక్సీ 

శంషాబాద్‌ రూరల్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి రప్పిస్తున్న ‘ఆపరేషన్‌ గంగ’ను స్వాగతిస్తూ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులోతెలుగు మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జంపాల రవితేజ ఆధ్వర్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటున్న విద్యార్థులు, పౌరులకు ‘ఽథ్యాంక్స్‌ టు ఇండియన్‌ గవర్నమెంట్‌.. ఆపరేషన్‌ గంగ’ అనే ఫ్లెక్సీతో స్వాగతం పలుకున్నారు. గురువారం 170 మంది విద్యార్థులు శంషాబాద్‌ చేరుకున్నారు.

Updated Date - 2022-03-04T05:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising