ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌నే కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-03-04T05:37:22+05:30

పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్‌నే కొనసాగించాలి

శ్రీవిద్యానికేతన్‌ పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌, మార్చి 3 : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్‌షి్‌పలో గల శ్రీవిద్యానికేతన్‌ పాఠశాలలో సీబీఎ్‌సఈ సిలబ్‌సనే కొనసాగించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. గురువారం పాఠశాల వద్ద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా న్యాయవాది కల్యాణ్‌దిలీప్‌, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సంస్కృతి టౌన్‌షి్‌పలో 2008వ సంవత్సరంలో సినీనటుడు మంచు మోహన్‌బాబు శ్రీవిద్యానికేతన్‌ పాఠశాలను నెలకొల్పినట్లు తెలిపారు. ఉన్నట్టుండి పాఠశాల యాజమాన్యం పాఠశాలను అగాపే అనే ఎన్‌జీవో సంస్థకు విక్రయించామని తెలడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సదరు సంస్థ నిర్వహించే స్టేట్‌ సిలబ్‌సలోనే చదువుకోవాలని, ఇష్టంలేని వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలని ఈమెయిల్స్‌ ద్వారా సమాచారం అందించారని తల్లిదండ్రులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఇప్పటివరకు సీబీఎ్‌సఈ సిలబస్‌ చదువుకొని, ఇప్పుడు స్టేట్‌ సిలబ్‌సలో ఎలా చదువుకుంటారని వారు ప్రశ్నించారు. కాగా, విద్యానికేతన్‌ పాఠశాల నిర్మాణానికి సంస్కృతి టౌన్‌షిప్‌ వాసులు ఎంతో శ్రమించారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బెజ్జంకి హరిప్రసాదరావు, కేఎస్‌ మూర్తి, శశి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-04T05:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising