ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి

ABN, First Publish Date - 2022-06-26T05:50:59+05:30

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి

పవర్‌లిఫ్టర్‌ మల్లికారాఘవేందర్‌గౌడ్‌కు చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌/శంషాబాద్‌రూరల్‌, జూన్‌ 25: గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని  ఎమ్మెల్యే  ప్రకా్‌షగౌడ్‌  అన్నారు.  ఇటీవల ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో మహిళల 84కేజీల విభాగంలో సిల్వర్‌మెడల్‌ సాధించిన గొల్లపల్లికి చెందిన మల్లికరాఘవేందర్‌గౌడ్‌ను అభినందించి, సొంతంగా రూ.2లక్షల నగదును స్థానిక కౌన్సిలర్‌ చెన్నం అశోక్‌తో కలిసి అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే సిల్వర్‌ మెడల్‌ సాధించిన మల్లికను, ఆమె భర్త రాఘవేందర్‌గౌడ్‌ను శాలువా కప్పి, భారీ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మల్లికకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, వైస్‌చైర్మన్‌ బండిగోపాల్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నీరటిరాజు, ఆర్‌.గణే్‌షగుప్తా, వెంకటే్‌షగౌడ్‌, కౌన్సిలర్లు వెంకటేష్‌, అమృతారెడ్డి, శ్రీకాంత్‌యాదవ్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌గౌడ్‌, మురళీయాదవ్‌ ఉన్నారు.

 ఎమ్మెల్యే ఎదుటే కన్నీటి పర్యంతం.. 

పవర్‌లిఫ్టింగ్‌ క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ మల్లికా రాఘవేందర్‌గౌడ్‌ ఆరోపించింది. ఆమెను అభినందించి సన్మానించిన అనంతరం మల్లికా  ఎమ్మెల్యే ఎదుటనే కన్నీటి పర్యంతమైంది. ఇప్పటికైనా పవర్‌లిఫ్టింగ్‌ క్రీడను గుర్తించి ప్రోత్సహించాలని  ఎమ్మెల్యేను కోరింది.  

Updated Date - 2022-06-26T05:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising