ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లకే హక్కులు

ABN, First Publish Date - 2022-06-24T05:30:00+05:30

చెరువులు, కుంటలపై ముదిరాజ్‌లకే హక్కులు

యాచారంలో ముదిరాజ్‌ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ప్రకాష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, జూన్‌ 24: రాష్ట్రంలో చెరువులు, కుంటలపై ముదిరాజ్‌ సంఘాలకే అన్ని హక్కులు కల్పించాలని యాచారం మండల ముదిరాజ్‌ సంఘ అధ్యక్షుడు నీలంశ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ చేతులమీదుగా ముదిరాజ్‌ సంఘజెండాను ఆవిష్కరించి అనంతరం సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. నీలంశ్రీకాంత్‌ మాట్లాడుతూ ఏటా చెరువులు, కుంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసి ఆదుకోవాలన్నారు. ముదిరాజ్‌లకు చెరువులు, కుంటల మెయింటెన్‌ అప్పగించాలని కోరారు. వృత్తిపరంగా ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో చేపల విక్రయ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలన్నారు.  ఈ సమావేశంలో వివిధ గ్రామాల ముదిరాజ్‌సంఘ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-24T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising