ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2022-08-15T05:44:35+05:30

ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి రాజీనామా చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విలేకర్ల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు

ఘట్‌కేసర్‌, ఆగస్టు 14 : టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన బీఫాంతో గెలుపొందిన అవుషాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తక్షణమే ఎంపీటీసీ, ఎంపీపీ పదవులకు రాజీనామా చేయాలని ఆపార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఘట్‌కేససర్‌ మున్సిపాలిటీలోని శివారెడ్డిగూడ బంధన్‌ పంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎన్‌.రమేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పలువురు నాయకులు, సర్పంచులు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి మండలంలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యం కల్పించి అందలం ఎక్కిస్తే.. ఎంపీపీ నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తంచేశారు. మాపార్టీ అవసరం లేనప్పుడు మాపార్టీ గుర్తుపై గెలిచిన పదవిని తక్షణమే వదిలేయాలన్నారు. లేనిచో ఆయన ఇంటిముందు నిరసన చేయాల్సి వస్తుందన్నారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు భిక్షపతిగౌడ్‌, శ్రీనివాస్‌, కుమార్‌, నాగార్జున, సత్యనారాయణరెడ్డి, బైరు రాములుగౌడ్‌, నరేష్‌గౌడ్‌, సర్పంచులు వెంకటేష్‌, సురేష్‌, మంగమ్మ, వెంకట్‌రెడ్డి, యాదయ్య, శివశంకర్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-08-15T05:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising