ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మోడల్‌ టెట్‌

ABN, First Publish Date - 2022-06-06T05:14:57+05:30

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో

మోడల్‌ టెట్‌ ప్రశ్నపత్రాన్ని విడుదల చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 5 :  తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో మోడల్‌ టెట్‌ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, నాగార్జున స్కూల్‌, గాయత్రీ స్కూల్లో నిర్వహించిన మోడల్‌ టెట్‌కు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షను రాశారు. టీఎ్‌సయుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య మోడల్‌ ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 35వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 2,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతుందని, అన్ని పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాలయ్య, జిల్లా అధ్యక్షుడు రాములయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, ఉపాధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, కల్పన, జగన్నాథశర్మ, భగవంత్‌రాజ్‌, మహిపాల్‌, సురేష్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


ఇబ్రహీంపట్నంలో..

ఇబ్రహీంపట్నం, జూన్‌ 5: టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నంలో మోడల్‌ టెట్‌ పరీక్ష నిర్వహించారు. ఇక్కడ వసుంధర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ పరీక్షకు 150మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మొదటి పేపర్‌, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో పేపర్‌ పరీక్ష నిర్వహించారు. టీఎ్‌సయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బి.రాములయ్య, కార్యదర్శి కిషన్‌ చౌహాన్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు సునంద, మంచాల మండల అధ్యక్షుడు అజ్మత్‌ఖాన్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మమతలు ముందుగా టెట్‌ మోడల్‌ పేపర్‌ను విడుదలచేసి అభ్యర్థులకు అందజేశారు.



Updated Date - 2022-06-06T05:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising