సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు.. కొలిక్కిరాని చైర్‌పర్సన్ల రాజీనామాలు
ABN, First Publish Date - 2022-08-04T05:52:54+05:30
సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు.. కొలిక్కిరాని చైర్‌పర్సన్ల రాజీనామాలు
తాండూరు, ఆగస్టు 3 : వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్లను మార్చే విషయంలో ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్‌రెడ్డిలు మంగళవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, ఆసమయంలో అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ విషయం సీఎం వరకూ ఎందుకు? రెండు రోజుల్లో తానే పరిష్కరిస్తానని ఎమ్మెల్యేలకు సర్ధిచెప్పి ఇతర అభివృద్ధి విషయాలను మాట్లాడించినట్లు తెలిసింది. అయితే, తాండూరు, వికారాబాద్ చైర్‌పర్సన్ల పదవి రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు ఇద్దరు చైర్‌పర్సన్లను మార్చి ఇతరులకు అవకాశం కల్పించాల్సి ఉంది. ఈ ఒప్పందం సమయంలో అప్పట్లో పెద్దలుగా మంత్రి తలసాని, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రదీప్‌కుమార్‌లు ఉన్నారు. గతనెల 27న పదవీకాలం గడువు ముగిసినా చైర్‌పర్సన్లను మార్చలేదు. వివిధ కారణాల వల్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రదీప్‌లు చైర్‌పర్సన్ల రాజీనామాపై గట్టిగా చెప్పలేకపోతున్నారు. చైర్‌పర్సన్ల వెనక ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఉండటంతో సమస్య పరిష్కారం కావడం లేదన్న వాదన వినిపిస్తోంది.. మరో మధ్యవర్తి మంత్రి తలసానిపై ఇద్దరు ఎమ్మెల్యేల ఒత్తిడి పెరిగింది.
Updated Date - 2022-08-04T05:52:54+05:30 IST