సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2022-12-15T23:55:56+05:30
బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మార్యదపూర్వకంగా కలిశారు.
చేవెళ్ల, డిసెంబరు 15 : బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మార్యదపూర్వకంగా కలిశారు. గురువారం దేశ రాజాధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే యాదయ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల జెడ్పీటీసీ ఎం. మాలతికృష్ణారెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, చేవెళ్ల వైస్ ఎంపీపీ. శివప్రసాద్, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మెన్ మిట్ట వెంకటరంగారెడ్డి, ఇంద్రన్న యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. జి. రవికాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-12-15T23:55:58+05:30 IST