రామలింగేశ్వరుడి సేవలో మంత్రి మల్లారెడ్డి
ABN, First Publish Date - 2022-10-18T04:32:18+05:30
రామలింగేశ్వరుడి సేవలో మంత్రి మల్లారెడ్డి
కీసర, అక్టోబరు 17: కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి సోమవారం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వహకులు మంత్రి మల్లారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం మంత్రి గర్భాలయంలోని మూలవిరాట్‌కు శ్రీమహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం ఆనంతరం ఆలయ మహామండపంలో అర్చకులు మంత్రి మల్లారెడ్డికి స్వామివారి శేషవస్ర్తాలు, తీర్థప్రసాదములు, ఆశీర్వచనలు అందజేశారు. అదే విధంగా నూతనంగా ఏర్పాట్టు అయిన ఆలయ నిర్మాణా కమిటీ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఈవో సుధాకర్, స్థానిక సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ, ఎంపీటీసీ నారాయణ శర్మ, పార్టీ మండల అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:32:18+05:30 IST