ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెగా వైద్య శిబిరం విజయవంతం

ABN, First Publish Date - 2022-08-10T05:49:06+05:30

మెగా వైద్య శిబిరం విజయవంతం

వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి, ఆగస్టు 9: లయన్స్‌క్లబ్‌ ద్వారా గ్రామాల్లో చేపడుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్‌ అధ్యక్షుడు బైరి కరుణాకర్‌రెడ్డి కోరారు. లయన్స్‌క్లబ్‌ ద్వారా కంటి, మదుమేహ, గుండె, వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామంలో మంగళవారం లయన్‌ కొత్త శంకరయ్య, గార్లపాటి లక్ష్మయ్యల జ్ఞాపకా ర్థం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో 476మందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించి సుమారు రూ.50వేల విలువ గల మందులను అందజేశారు. లయన్స్‌ క్లబ్‌ సేవలను విస్తృత పరుస్తామని క్లబ్‌ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు కసిరెడ్డి రాంరెడ్డి, కుడుముల భాస్కర్‌రెడ్డి, ఓంకారం, జూలూరి రమేశ్‌, శ్రీనివా్‌సరెడ్డి, బాలకృష్ణ, పాండురెడ్డి, బికుమాళ్ల వెంకట్‌, కళ్యాణ సాయి రాధాకృష్ణ, పీఆర్‌వో పాషా, జూలూరి లింగయ్య, గోపాల్‌, స్థానిక ఎంపీటీసీ సరితగణేశ్‌, కసిరెడ్డి వెంటక్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, అంజిరెడ్డి, రఘుమారెడ్డి, చప్పిడి నర్సింహ, ఉపసర్పంచ్‌ యాదయ్య, వైద్యులు దామోదర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణ, వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising