ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలి

ABN, First Publish Date - 2022-05-21T04:55:45+05:30

సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలి

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, మే 20: ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ పేద ప్రజలకు సేవా దృక్పథంతో ఉచిత వైద్య సేవలు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ కోరారు. పట్టణంలోని షాద్‌నగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన స్వాతి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని శుక్రవారం జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్‌, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోటగిరియాదవ్‌, ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్‌ రాందాస్‌ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సూచించారు. లాభపేక్షతో కాకుండా పరిస్థితులకు అనుగుణంగా వైద్యసేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి, మున్సిపల్‌చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, డాక్టర్లు మధు, నాగరాజు, వినోద్‌, శ్రవంతి, ప్రజాప్రతినిధులు, నాయకులు చెక్కాల లక్ష్మణ్‌, సుండూరు శేఖర్‌, శ్రీకాంత్‌సింగ్‌, సయ్యద్‌ ఖలీల్‌, రూపం వెంకట్‌రెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ 

కడ్తాల్‌, మే 20: ముద్విన్‌ గ్రామానికిచెందిన అన్నెపు పద్మకు రూ.13వేలు, అన్నెపు కవితకు రూ.8వేలు సీఎం సహాయనిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వినోద్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, నాయకులు గోపాల్‌, రాజు, శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T04:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising