ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మన ఊరు-మన బడి’ పనులను సకాలంలో పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2022-05-25T05:17:01+05:30

‘మన ఊరు-మన బడి’ పనులను సకాలంలో పూర్తిచేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌, మే 24 : ‘మన ఊరు-మన బడి’ పనులను వేగవంతం చేసి జూన్‌ 2 నాటికి మండలానికి రెండు పాఠశాలల చొప్పున పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నిఖిల ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక డీపీఆర్‌సీ భవనంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ అధికారులు, డీఈవోలు, ఏఈలతో మండలాల వారీగా సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 30 లక్షల వ్యయం కన్నా తక్కువగా ఉన్న పాఠశాలల నిర్మాణం, సుందరీకరణ పనులకు సాంకేతిక, పరిపాలన అనుమతులను ఆమోదించుకొని నిర్మాణపు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రతి మండలానికి రె ండు పాఠశాలల చొప్పున.. జూన్‌ 2 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. రూ.30 లక్షలకు ఎక్కువగా అయ్యే పాఠశాలల్లో గ్రౌండింగ్‌ పనులు ప్రారంభించాలని.. వెంటనే టెండర్‌ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. ఈ విషయంలో స్పెషల్‌ ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యతతో కూడిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, వికారాబాద్‌ ఆర్డీవో విజయకుమారి, స్పెషల్‌ ఆఫీసర్లు ఎంఈవోలు, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising