‘మాల్‌ను మండల కేంద్రంగా మార్చాలి’
ABN, First Publish Date - 2022-09-02T05:49:42+05:30
‘మాల్‌ను మండల కేంద్రంగా మార్చాలి’
యాచారం, సెప్టెంబరు 1: రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మాల్‌ను తక్షణమే మండల కేంద్రంగా మార్చాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మాల్‌లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మండల సాధనకు శాంతియుత ఆందోళనకు సిద్ధమవుతున్నామన్నారు. సమావేశంలో ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్, సీపీఐ మర్రిగూడ మండల కార్యదర్శి యాదగిరి, యాచారం మండల కాంగ్రెస్ నాయకులు, నల్లవెల్లి ఎంపీటీసీ లక్ష్మీపతిగౌడ్, సీపీఎం చింతపల్లి మండల కార్యదర్శి రాములు, యాచారం మండల కార్యదర్శి నర్సింహ, ఎమ్మార్పీఎస్ నాయకులు మందలింగం, సర్పంచులు ఎండీ హబీబొద్దీన్, పెద్దులు, రవీందర్, ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు విప్లవ్‌కుమార్, రైతు సంఘం నాయకులు భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - 2022-09-02T05:49:42+05:30 IST