ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి మైసిగండి మైసమ్మ బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2022-11-08T23:50:36+05:30

మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు

విద్యుత్‌ కాంతుల వెలుగులో మైసిగండి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, నవంబరు 8: మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు రానున్నారు. ఉత్సవాల వివరాలను మంగళవారం ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలిపంతూ, ఈవో స్నేహలత వివరించారు. నేడు(9వ తేది) అమ్మవారికి మహానివేదన, క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి, 10న శత చండీహోమం, రాత్రికి పుష్ప రథోత్సవం, 11న శత చండిహోమం, విశేష పూజలు, 12న అమ్మవారి పెద్ద రథోత్సవం, పూర్ణాహుతి, 13న అమ్మవారికి బోనాలు, బండ్లు తిప్పుట, 14న విశేష పూజలు, అర్చనలు, 15న వివిధ కూరగాయాలతో అమ్మవారికి అలంకరణ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-11-08T23:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising