ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటగ్యాస్‌ ధర పెంపునకు నిరసనగా నేడు బాలాపూర్‌లో మహాధర్నా

ABN, First Publish Date - 2022-05-15T06:29:59+05:30

వంటగ్యాస్‌ ధర పెంపునకు నిరసనగా నేడు బాలాపూర్‌లో మహాధర్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి

రంగారెడ్డి అర్బన్‌, మే 14: పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారంగా మారుతున్న గ్యాస్‌ ధర పెంపుదలను నిరసిస్తూ ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్‌ చౌరస్తాలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శనివారం తెలిపారు. స్పల్ప కాలంలోనే రెండుసార్లు 50రూపాయల చొప్పున సిలిండర్‌ ధర పెంచి పేద, మధ్య తరగతి ప్రజల వంటింట్లో కష్టాలు తెచ్చిన కేంద్ర ప్రభుత్వంపై నేడు మహిళలు పెద్ద ఎత్తున అందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 8ఏళ్ల కిందట రూ.400 ఉన్న వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు 1,052 రూపాయలకు చేర్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీజేపీ పాలనా విధానం చూస్తుంటే మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిపై వండి కన్నీరు కార్చేవిధంగా ఉందన్నారు. ఎల్పీజీ ధర ప్రపంచంలోకెల్లా మన దేశంలోనే ఎక్కువ ఉందని, నేడు బాలాపూర్‌ చౌరస్తాలో సిలిండర్‌ ధరల పెంపుపై భారీ ధర్నా చేపట్టి నిరసనలు ఢి ల్లీకి వినిపించేలా మహిళలు గర్జిస్తారని చెప్పారు. ఈ ధర్నాకు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకక్తలు తరలిరావాలని మంత్రి కోరారు.

Updated Date - 2022-05-15T06:29:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising