ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలను అరికడతాం

ABN, First Publish Date - 2022-01-25T04:10:01+05:30

ఆక్రమణలను అరికడతాం

ఎరిమల్లెవాగులోంచి బండరాళ్లను బయటకు తీయిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల్లో కదలిక
  •  వాగు పూడ్చివేతపై కదిలిన జిల్లా యంత్రాంగం
  •  వాగులో బండరాళ్ల తొలగింపు

ఘట్‌కేసర్‌. జనవరి 24 : ఎరిమల్లె వాగు ఆక్రమణపై   జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’  దిన పత్రికలో  ప్రచురితమైన  దర్జాగా పూడ్చివేత.. కనుమరుగవుతున్న ఎరిమల్లెవాగు కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. వాగును పరిశీలించి పూడ్చివేతనలను తొలగించే పనికి శ్రీకారం చుట్టారు.  రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అలేఖ్య, ఇరిగేషన్‌ ఏఈ గంగా,  ఘట్‌కేసర్‌, పోచారం మునిసిపల్‌ కమిషనర్లు వసంత, సురేష్‌ తదితరులు వాగు పూడ్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఆవుట్‌లో ఉన్న ఎక్స్‌కవేటర్‌ను తెప్పించి వాగులో వేసిన బండరాళ్లను బయటకు తీయించేశారు.  రెండు రోజుల్లో వాగును సర్వేచేయించి సంరక్షణ చర్యలు చేపడతమని అదికారులు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌ మాట్లాడుతూ వాగును పూడ్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాగులో వేసిన రాళ్లను, మట్టిని తొలంగించాలని ఆదేశించారు. అధికారులు తరుచూ వాగులను పరిశీలిస్తూ ఆక్రమణలకు అడుకట్ట వేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ, కాశయ్య, రాఘవేందర్‌రెడ్డి, శేఖర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising