ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా నుంచే రాష్ట్రాన్ని శాసిద్దాం

ABN, First Publish Date - 2022-10-08T04:16:42+05:30

జిల్లా నుంచే రాష్ట్రాన్ని శాసిద్దాం

పరిగిలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి,పక్కన డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాదే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

పరిగి/కొడంగల్‌, అక్టోబరు7: వికారాబాద్‌ జిల్లా నుంచే రాష్ట్ర రాజకీయాలు శాసిద్దామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.  పరిగిలో డీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం ట్రీమ్స్‌ మెడికల్‌ కాలేజీ వైఎస్‌ చైర్మన్‌ రిత్వీక్‌రెడ్డి జన్మదిన వేడుకలకు హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సిద్దిపేటోళ్ళకు జోలే పట్టుకుని అడుక్కునే అవకాశం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిపై రేవంత్‌ అరోపణలు చేశాడు. గుడి మాన్యాలను మింగిన ఎమ్మెల్యే గుడిలోని లింగాన్ని మింగుడా అంటూ చరకలట్టించారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి పరిగి అభివృద్దే అకాంక్షించే  నాయకుడని అభినందించారు. అనంతరంటి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, పగిగిలో వందపడకల అస్పత్రి నిర్మించి, ఈ ప్రాంత ప్రజల వైద్యసేవలు అందిస్తానని తెలిపారు. తాను ఏలాంటి పదవి లేనప్పుడే రూ.5వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా కృషి చేశానని చెప్పారు. ట్రీమ్స్‌ వైఎస్‌ చైర్మన్‌ టి.రిత్వీక్‌రెడ్డి మాట్లాడుతూ, టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల,అస్పత్రి ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఉపాధ్యక్షుడు ఎం.రమేశ్‌,  పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శులు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, హన్మంత్‌, డీసీఎమ్మెఎస్‌ మాజీ చైర్మన్‌ బి.భీంరెడ్డి, బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిద్దాంతి పార్థసారథి, బి.పరుశరాంరెడ్డి, సురేందర్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, బీఎ్‌స.ఆంజనేయులు, నర్సింహారావు, కడ్మూరి శ్రీనివాస్‌, ఆనంద్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం 

కొడంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు తన హయాంలోనే మంజూరయ్యాయని తెలిపారు.  50 పడకల ప్రభుత్వాసుపత్రులు అసంపూర్తి దశలో ఉన్నాయని ఆరోపించారు ప్రస్తుత కొడంగల్‌ నియోజకవర్గంలో 8 మండలాలు ఉండగా పాలన సౌలభ్యం కోసం కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 8మండలాలు గల ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం దత్తత తీసుకున్న కొడంగల్‌పై వివక్ష చూయిస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు జీవో 69 తీసుకొచ్చినా అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పాలమూర్‌-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తితో కొడంగల్‌ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామని గొప్పలు చెప్పిన నాయకులు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాగా  అంతకు ముందు శుక్రవారం కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనమేనని, అధికారంలోకి వచ్చాక అన్నీ వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. వీఆర్‌ఏలు ఆత్మహత్యలకు పూనుకోవద్దన్నారు. అనంతరం  కొడంగల్‌ పెద్ద చెరువు పాటు కాలువ తెగిపోవడంతో బాలాజీ నగర్‌, కుమ్మరివీధిలోని ఇళ్లలోకి వరద నీరు చేరిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎండీ.యూసుఫ్‌, నందారం ప్రశాంత్‌, యం.కృష్ణంరాజు, రెడ్డి శ్రీనివాస్‌, నయీం, దాము, యస్‌. సోమశేఖర్‌, శంకర్‌నాయక్‌, తార్యానాయక్‌, రాము, రమేశ్‌, నర్సింహులునాయుడు, ఉడిమేశ్వరం శ్రీను, ఓం ప్రకాశ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-08T04:16:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising