ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడ పిల్లలను రక్షించుకుందాం.. సృష్టిని కాపాడుదాం

ABN, First Publish Date - 2022-01-25T05:06:10+05:30

ఆడ పిల్లలను రక్షించుకుందాం.. సృష్టిని కాపాడుదాం

వికారాబాద్‌: సమావేశంలో మాట్లాడుతున్న అధికారి లలితకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌/ధారూరు/కొడంగల్‌ రూరల్‌/పరిగి, జనవరి 24 : ఆడపిల్లను రక్షించుకుని సృష్టిని కాపాడుదామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి అన్నారు. సోమవారం మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో యజ్ఞ ఫౌండేషన్‌ బాలికల ఆశ్ర మంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 2008 నుంచి ప్రతీ జనవరి 24న నేషనల్‌ గర్ల్‌చైల్డ్‌ డేను నిర్వహిస్తున్నామన్నారు. లింగ అసమానత, లైంగిక వేధింపులు తొలగించడం, ఆడపిల్లల హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలికల విద్య, ఆరోగ్యం, పోషణపై అవగాహన పెంచడం జాతీయ బాలికల దినోత్సవం లక్ష్యాలన్నారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరూ కృషిచేసినప్పుడే ఆడ, మగ వ్యత్యాసాలు తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటేశ్వరమ్మ, జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ సిబ్బంది లక్ష్మణ్‌, రియాజుద్దీన్‌, సఖి సిబ్బంది అనిత, ఫౌండేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి హక్కులు, సమానత్వం సాధించుకోవాలని సీడీపీవో వెంకటేశ్వరమ్మ అన్నారు. నాగారంలో చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు చేయకూడదని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతీ నెల మూడో శనివారం అంగన్‌వాడీ కేంద్రంలో ఆడప్లిలలు సమస్యలు చెప్పుకునే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్‌లైన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆడపిల్లలపై హింస, వేధింపులు, లింగ అసమానతలు కొనసాగుతున్నాయని, బాల్యవివాహాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ఎదుర్కునేందుకు విద్య ఒక్కటే మార్గమన్నారు. టీచర్‌ సురేందర్‌రెడ్డి, చైల్డ్‌లైన్‌ యాదయ్య, సంజమ్మ, అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. కొడంగల్‌ ఉన్నత పాఠశాలలో బాలికా దినోత్సవా న్ని జరుపుకున్నారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పార్వతిదేవి, హెచ్‌ఎం ప్రసన్న, పోలీసు సిబ్బంది సాయిఐశ్వర్య, చైల్డ్‌లైన్‌ సిబ్బంది పాల్గొన్నా రు. బాలికలు చదువుల్లో రాణించాలని పరిగి ఎస్‌ఐ అనిత, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ఇందిర ఉన్నారు. ఇం ద్రనగర్‌ అంగన్‌వాడీలో వారు మాట్లాడుతూ.. బాలికలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ముందుకు సాగాలన్నారు. చైల్డ్‌లైన్‌ కో-ఆర్డినేటర్లు రాములు, వెంకటేశ్‌, దేవకుమారి, రాంచంద్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising