‘ఎస్టీయూ బలపర్చిన అభ్యర్థిని ఎన్నుకుందాం’
ABN, First Publish Date - 2022-10-18T05:29:40+05:30
‘ఎస్టీయూ బలపర్చిన అభ్యర్థిని ఎన్నుకుందాం’
కొడంగల్, అక్టోబరు 17: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్టీయూ బ లపర్చిన అభ్యర్థి బి.భుజంగరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ కోరారు. సోమవారం వివిధ పాఠశాలలను సందర్శించి ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు విష్ణుకుమార్, మం డల బాధ్యులు ఆశప్ప, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:29:40+05:30 IST