ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ మెడలు వంచి హక్కులను కాపాడుకుందాం

ABN, First Publish Date - 2022-10-18T04:34:34+05:30

సీఎం కేసీఆర్‌ మెడలు వంచి హక్కులను కాపాడుకుందామని

సమావేశంలో మాట్లాడుతున్న జయలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి 

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 17: సీఎం కేసీఆర్‌ మెడలు వంచి హక్కులను కాపాడుకుందామని ఆశావర్కర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధి తొండుపల్లి ఎంఎస్‌ గార్డెన్‌లో ఆశావర్కర్ల రాష్ట్ర మహాసభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆమె మాట్లాడారు. తెలంగాణలో ఆశావర్కర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. చాలీచాలని జీతాలతో కాలం వెల్లదీస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేశారని గుర్తుచేశారు. అప్పట్లో ఆశావర్కర్లను పొగిడిన సీఎం కేసీఆర్‌ జీతాలు మాత్రం పెంచలేదని మండిపడ్డారు. ఈరోజుల్లో ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.25వేలు అవసరమవుతోందని, ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వఉద్యోగులకు కల్పించిన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆశావర్కర్లంతా తలుచుకుంటే కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టిస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి చంద్రమోహన్‌, అధ్యక్షులు ఎన్‌.రాజు, కోశాధికారి కవిత, సీఐటీయూ జిల్లా నాయకులు సాయిబాబా, రుద్రకుమార్‌, జగదీష్‌, రాంమోహన్‌, నర్సిరెడ్డి, దేవేందర్‌, స్వప్న, మల్లేష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-18T04:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising