ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు నీరు వదిలి రైతులను ఆదుకోండి

ABN, First Publish Date - 2022-10-08T04:09:26+05:30

చెరువు నీరు వదిలి రైతులను ఆదుకోండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, అక్టోబరు 7: ఇబ్రహీంపట్నం చెరువు నీటిమట్టం పెరిగినందున ఆయకట్టుకు నీరు వదలాలని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఉప్పరిగూడ సర్పంచ్‌ బూడిద రాంరెడ్డి నీటి పారుదల శాఖ అధికారులు, కలెక్టర్‌ను కోరారు. ఇప్పటికే ఈ విషయమై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చెరువు నీటిమట్టం పెరగడంతో రైతుల పొలాలు కనుమరుగయ్యాయన్నారు. చెరు వు ఎఫ్‌టీఎల్‌లో ఉప్పరిగూడ, పోచారం, కర్నంగూడ, చెర్లపటేల్‌గూడలకు చెందిన అనేక మంది రైతుల పంటపొలాలు నీట మునిగి ఉన్నాయని, ఈ పొలాలు నీటిని వదిలితేనే రైతులు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. అంతేగాక ఆయకట్టుకు నీరొదిలితే వందలాది రైతులు పంటలు సాగుచేసుకుంటారని గుర్తుచేశారు. అదేవిధంగా ఈ విషయమై నీటి పారుదలశాఖ అధికారులకు శుక్రవారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి, ఎన్ను యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షుడు దండె శ్రీశైలం యాదవ్‌, పోరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయకట్టుకు నీరు వదలాలని కోరారు.

Updated Date - 2022-10-08T04:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising